– టీజీఈసీఎస్‌బీ తనిఖీల్లో 1227 మంది నిందితుల గుర్తింపు
– సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ సిఖాగోయల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీఈసీఎస్‌బీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కలిసి ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా నిందితుల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించాయని సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ సిఖాగోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల్లో అరెస్టయిన నిందితుల ప్రస్తుత ఆచూకీని గుర్తించడం, వారిపై నిఘా ఉంచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో రాష్ట్రంలో నివసిస్తున్న 127 మంది నిందితులను గుర్తించారు. వారిలో 57 మంది రాష్ట్రానికి చెందినవారు, ఇతర రాష్ట్రాల పోలీసులచే వివిధ సైబర్ నేరాల్లో అరెస్టు అయిన వారు. 127 మంది నిందితుల్లో 48 మంది నకిలీ గుర్తింపుతో మోసం చేసేవారు. 27 మంది పెట్టుబడి మోసాలు, 11 మంది డిజిటల్ అరెస్ట్ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ మూడు రకాల నేరాలు మొత్తం నిందితుల్లో దాదాపు 68% వాటాను కలిగి వున్నాయన్నారు. ఇవే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అత్యధికంగా వాడుతున్న పద్ధతులని వివరించారు. కాగా, అరెస్టయిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్ళను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ), తెలంగాణ పోలీసులు సైబర్ మోసాల నుండి ప్రజలను రక్షించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నేరగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి సదా సంసిద్ధంగా ఉన్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





