– పారిశ్రామికాభివృద్ధికి అనువైన ప్రదేశం
– 2027 డిసెంబర్ కల్లా శంషాబాద్ నుండి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం పూర్తి
– భావితరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు విద్యాసంస్థల ఏర్పాటుకు రేర్ ఎడ్యుకేషన్ హబ్
– ‘రేర’ ఇండస్ట్రియల్ హబ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : కొడంగల్ రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ(రేర్) ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధితో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2027 డిసెంబర్ కల్లా శంషాబాద్ నుండి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని, విమానాశ్రయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇండస్ట్రియల్ హబ్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా దాదాపు వందమంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. కొడంగల్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంతం, ఇతర పారిశ్రామిక క్లస్టర్లకు చెందిన ఏరోస్పేస్, రక్షణ రంగం, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, టెక్స్ టైల్, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రేర్ ఇండస్ట్రీయల్ హబ్‌తోపాటు నెట్‌వర్క్ ఆఫ్ ఆప్పెరల్ రెడీనెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎనఏఆరఐ) పార్క్, త్రైవ్ హబ్, రీజినల్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్(ఆరఐఎసఈ) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడం తన బాధ్యత మాత్రమే కాక తన కల అని తెలిపారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ స్థానిక యువతకు తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కలిగించడమే లక్ష్యమని, కొడంగల్ రేర్ ఇండస్ట్రియల్ హబ్‌లో 943.34 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఆకర్షించేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కొడంగల్‌తోనే తన గుర్తింపు, ఆత్మగౌరవం అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో అనువైన ప్రాంతమని, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. హబ్ భూసేకరణకు రూ.220 కోట్లు వ్యయం కాగా రోడ్లు, నీరు, విద్యుత్తు వంటి మౌలిక వసతులను అభివృద్ధి పనులకు రూ.441.91 కోట్ల వ్యయ ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ హబ్‌లో బిర్లా నూ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన ఫైబర్ సిమెంట్ బోర్డుల తయారీ పరిశ్రమ, ఎకోపామ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన వెజిటబుల్ ఆయిల్స్, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం మొత్తం 96 ఎకరాల భూమిని కేటాయించగా ఈ రెండు సంస్థల ప్రతిపాదిత పెట్టుబడులు మొత్తం కలిపి రూ.252.86 కోట్లు. ఉందని చెప్పారు. వాటితో దాదాపు 535 ఉద్యోగావకాశాలు రానున్నాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఈ ఇండస్ట్రియల్ హబ్‌లో నిర్మాణాలు చేపడుతుండడం, మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలకు పరిశ్రమల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతోపాటు విద్యాసంస్థల ఏర్పాటు కోసం 250 ఎకరాల్లో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ రూపుదిద్దుకుంటున్నదన్నారు.
రేడియల్ రోడ్ నిర్మాణంతో కేవలం 70 నిమిషాల్లో కొడంగల్ చేరుకునే అవకాశం ఉంటుందని, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టే ముందు మొదటిగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంత దూరంలో ఉందో చూస్తారని వివరించారు. రానున్న కాలంలో చందన్‌వెల్లి, సీతారాంపూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాలు గొప్ప పారిశ్రామిక అభివృద్ధికి నోచుకుంటాయని చెప్పారు. కొడంగల్ అన్ని రకాలుగా అభివృద్ధికి అనువైన వ్యూహాత్మక ప్రాంతమని, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తక్కువ దూరంలో ఉండడం విశేషమని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల వనరులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం అధికారులు నిత్యం సహకరించడానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు జరుగుతుందని, టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో విద్యార్థులకు శిక్షణ అందుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కోర్సులు అందించవచ్చని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





