– మేఘావృతమై ఉరుములతో చిరు జల్లులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : హైదరాబాద్ మహానగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తీవ్రమైన ఎండ దంచి కొట్టగా ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం మేఘావృతం అయ్యింది. ఉరుములతో పలుచోట్ల చిరుజల్లుల కురిసాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని తెలిపింది. తెలంగాణలో ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావం నెలకొందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అదేవిధంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





