మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం

– మహిళా సాధికారత కోసం ఎఫ్‌ఎల్‌వోకు మరో ఇండస్ట్రియల్ పార్క్
– ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఎకరం స్థలాన్ని కేటాయిస్తాం
– ‘ఫిక్కీ’ మహిళా పారిశ్రామికవేîత్తల సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వ బలం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని, త్వరలోనే ప్రారంభించబోతున్నామని, ఈ భవనాలను శిక్షణ, మార్కెటింగ్, వ్యాపారానికి కేంద్రంగా పనిచేసేలా కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫఎల్‌వో) హైదరాబాద్ విభాగం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంసీహెచఆర్‌డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహిళా పారిశ్రామికవేత్తలు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైటెక్ సిటీ ప్రాంతంలో శిల్పారామంకు అనుకుని రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ నిర్వహణకు కేటాయించామన్నారు. గ్రామీణ హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తులను విక్రయించడానికి ఈ బృందాలకు ప్రత్యేకంగా కేటాయించిన 150కిపైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. అదే స్పూర్తితో మహిళా సాధికారత కోసం ఫిక్కీ అభ్యర్థనలను అత్యంత ప్రాముఖ్యతతో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని, హైటెక్ సిటీ, సిఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ కార్యాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని తెలిపారు. దీంతోపాటు ఫిక్కీని ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామిని చేసే ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని, మహిళల అభ్యున్నతికి ఏమి చేసినా వ్యక్తిగతంగా తనకు చాలా సంతృప్తినిస్తుందని చెప్పారు. అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థ ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుందని, రానున్న రోజుల్లో ప్రపంచ అగ్రగామి ఫార్చ్యూన్-500 కంపెనీలనన్నింటినీ ఫ్యూచర్ సిటీలో నెలకొల్పాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, దీంట్లో ఫిక్కీతోపాటు మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం కానుందని వివరించారు. ఎఫఎల్‌వో ఆధŠ్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మరొక ఇండస్ట్రియల్ పార్కును మహిళా సాధికారత కోసం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగిన దేశాల్లో ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, 2027లో వందేళ్ళు పూర్తి చేసుకోవడం సంతోషకరమని, ఈరోజు మహిళా వ్యాపారవేత్తలతో సమావేశం కావడం ఆనందకరమని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను శాయశక్తులా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని, వారితో ప్రతీ మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో మహిళా పొదుపు సంఘాలు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయంటూ ప్రభుత్వం వాటిని ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం ఎనిమిది వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేసామని, మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించే దిశగా పనిచేస్తున్నామని కూడా తెలిపారు. వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అవార్డులు ఇచ్చి గౌరవించుకునే ఆనవాయితీ తీసుకురావాలన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యమైన 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో తన వాటాను 5% నుండి 10%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ దేశానికి మహిళలను అత్యంత ఉన్నత స్థానాల్లో ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, జడ్జిలు, గవర్నర్లుగా మహిళలను ప్రోత్సహించిందని, సోనియా గాంధీ 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటివరకు అది అమలు కాలేదని, వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ఎఫఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజా గర్గ్, ఎఫఎల్‌వో హైదరాబాద్ చైర్పర్సన్ సీతారెడ్డి గడ్డం, సహా అనేకమంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
———————
కల్తీల నిరోధానికి కఠిన చట్టం- చట్టం తయారీకి శాసనసభలో సమగ్ర చర్చ  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు అన్ని కల్తీ అవుతండడంతో ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టంపై ఎంసీహెచఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతుండడంతో ప్రజలు అనాsగ్యానికి గురవుతున్నారని సీఎం తెలిపారు. ఎరువులు, పురుగు మందుల భారీ వాడకంతో పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు బయటపడి దిగుమతి చేసుకోవడానికి విదేశాలు నిరాకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల ఉత్పత్తులు అమ్ముతున్నారని, అధిక ధరలు ప్రజలు వాటిని కొంటున్నా అవి సేంద్రియ ఉత్పత్తులే అని నిర్ధ్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా ఒక సమగ్రమైన నివేదికను తయారు చేయాలన్నారు. దానిపై బిల్లు రూపొందించి శాసనసభలో సమగ్రమైన చర్చ చేపడతామని తెలిపారు. శాసనసభలో చర్చతోపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని సూచించారు. కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లను నియమించాలని, టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కల్తీల నిరోధానికి సంబంధించి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైýట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక్కడ నిబంధనలు అమలు చేసి వాటి అమలులో వచ్చే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి.ఆనంద్, సీఎం సలహాదారు, ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, ఎన్.శ్రీధర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *