తాండూరు ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు

– ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– రూ.290 కోట్ల విలువైన హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– ప్రపంచస్థాయి రోడ్ల‌ నిర్మాణమే ధ్యేయం
– ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి
 – అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీకి నిధులు :మంత్రి శ్రీధర్ బాబు
– పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి :మహేందర్ రెడ్డి
తాండూరు, ప్రజాతంత్ర, జూలై 18: కొడంగల్‌ తరువాత జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్న‌ట్లు ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యామ్ ప్రాజెక్టు కింద రూ. 340 కోట్లతో చేపట్టే రోడ్ల నిర్మాణ పనులకు శనివారం అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు.ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కందనెల్లి జీపీఆర్ గార్డెన్ లో తాండూరు బైపాస్ భూ నిర్వాసితులకు మంజూరైన రూ. 25 కోట్ల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. తరువాత జరిగిన ప్రగతి సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగించారు. అభివృద్ధిలో కోడంగల్‌ తరువాత తాండూరుకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 900 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. తాజాగా తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.అదేవిధంగా ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు. కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే 94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించదని మందు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని అన్నారు.తాండూరులో కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు. మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు. చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చారని గుర్తుచేశారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం సహాకారంతో అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేసి.. రైతులకు మేలు జరిగేలా చూస్తామన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బషీరాబాద్ రోడ్ల అభివృద్ధియే కాక 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్ పర్సన్ కల్వ సుజాత, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్, జిల్లా అధికారులు, తాండూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రోడ్ల అభివృది : స్పీక‌ర్‌  ప్రసాద్ కుమార్
వికారాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి జరుగుతోందని వికారాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని శివారెడ్డిపేట్ ఆర్టీవో కార్యాలయం వద్ద రూ.261 కోట్ల వ్యయంతో హ్యాం రోడ్ల పనులకు , ఆరఅండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుదిళ్ల శ్రీదర్‌బాబులతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని, ప్రతి మండల కేంద్రానికి ఈటీ రోడ్డు, డబల్ రోడ్డు వేయాలనే లక్ష్యంతో నిధులు వచ్చాయని, నియోజకవర్గ స్థాయిలో స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ను అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని, రోడ్లు, భవనాల శాఖ ఆధŠ్వర్యంలో రూ.261 కోట్లతో హ్యాం రోడ్ల పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. సమావేశంలో కౌన్సిల్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల, తాండూరు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బి.మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, స్నేఎస్పీ స్నేహా మెహ్రా, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *