రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి

– వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలి
– జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం

న్యూదిల్లీ, ఆగస్ట్ 14: భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది. ముర్ము సందేశమిచ్చారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాక డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మనం గుర్తుంచుకోవాలన్నారు. చరిత్రాత్మక రోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పున స్మరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించిన ఆమె.. న్యాయ వ్యవస్థను, చట్టసభలను గౌరవించాలని ప్రజలకు సందేశమిచ్చారు. తాజాగా లోక్ సభలో మొట్టమొదటిసారిగా ఆలపించిన వందేమాతరం గీతాన్ని పౌరులంతా గౌరవించాలని రాష్ట్రపతి కోరారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. ‘జనధన్ ద్వారా దేశవ్యాప్తంగా 59 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు అందించాం. 80 కోట్ల మందికి రేషన్ సరకులు అందజేస్తున్నాం.. ఆయుష్మాన్ భారత్ ద్వారా 60 కోట్ల మందికి వైద్యసేవలు అందుతున్నాయి.. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు బలోపేతమయ్యాయి.. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగాలి.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మౌలిక సదు పాయాలు ఏర్పాటు చేసుకున్నాం.. కుగ్రామాల్లోనూ డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. .ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు మన దేశంలోనే జరుగుతున్నాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *