– త్వరలో 1.15కోట్ల మందికి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం
– డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కయాదాద్రి, భువనగిరి, ప్రజాతంత్ర, జూన్ 9: గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, క్వాలిటీ పవర్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18,546 మెగావాట్ల రికార్డు స్థాయి పీక్ డిమాండ్ నమోదైనప్పటికీ, కనురెప్ప పాటు కూడా కరెంట్ పోకుండా నిరంతర విద్యుత్తును అందించి ఘనత సాధించిందని కొనియాడారు.యాదాద్రి భువనగిరి జిల్లా సర్కిల్ పరిధిలో, భువనగిరి పట్టణంలోని 5.83 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సర్కిల్ కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో 2.67 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను కూడా ఈ సర్కిల్ కార్యాలయం నుంచే రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల రైతులకు నాణ్యమైన విద్యుత్ అంది లబ్ధి చేకూరుతుందన్నారు. భువనగిరి మండలం హనుమపురం గ్రామంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా 2.03 కోట్లతో నిర్మించనున్న ‘స్టోర్ కాంప్లెక్స్’కు, అలాగే వలిగొండ మండలం నర్సాపూర్ గ్రామంలో ₹3.52 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.భువనగిరి సర్కిల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజల ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్రసంగించారు. కోటి 15 లక్షల కుటుంబాలకు ‘ఇందిరమ్మ కుటుంబ భీమా’దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు కులమతాలతీతంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ. 5 లక్షల ధీమా కల్పించేలా ‘ఇందిరమ్మ కుటుంబ భీమా’ పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నామని తెలిపారు. బసవపురం భూ నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి పరిహారం త్వరగా అందేలా తక్షణ చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు కరెంట్ సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నూతన 33/11 సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఇట్టి సబ్ స్టేషన్ లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. 5 కోట్లతో నూతన సర్కిల్ ఆఫీస్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ స్టోరేజ్ గోడౌన్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నందున భువనగిరిలోని స్టోరేజ్ మొత్తం నల్లగొండ స్టోరేజ్ లో చేయాల్సి ఉందన్నే విషయాన్ని గుర్తించి భువనగిరి నియోజకవర్గంలోనే నూతన స్టోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 8 సబ్ స్టేషన్ లు త్వరలో ఏర్పాటు చేస్తామని , తదనుగుణంగా భువనగిరి లో నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదన్నారు. గత పాలనలో ఒక్క సబ్ స్టేషన్ కూడా మంజూరు చేయలేదని, ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నూతన సబ్ స్టేషన్ లు మంజూరయ్యాయన్నారు.శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రైతులకు అవసరమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు అందించేలా చూడాలని అన్నారు. నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక గొప్ప వరం అని అన్నారు. నూతన సబ్ స్టేషన్ ల ద్వారా విద్యుత్ అంతరాయం ఉండదన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, టీజేఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ పాటిల్ ఐ.ఏ.ఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి, తడక వెంకటేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇళ్లు
ప్రతి వారికి రూ.5 లక్షల చొప్పున అర్హులైన ప్రతి వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇళ్లను కేటాయించబోతున్నట్లు హామీ ఇచ్చారు. కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ భీమా దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు కులమతాలతీతంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ. 5 లక్షల ధీమా కల్పించేలా ‘ఇందిరమ్మ కుటుంబ భీమా’ పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నామని తెలిపారు. బసవపురం భూ నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి పరిహారం త్వరగా అందేలా తక్షణ చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు కరెంట్ సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నూతన 33/11 సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఇట్టి సబ్ స్టేషన్ లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. 5 కోట్ల తోటి నూతన సర్కిల్ ఆఫీస్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ స్టోరేజ్ గోడౌన్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నందున భువనగిరి లోని స్టోరేజ్ మొత్తం నల్లగొండ స్టోరేజ్ లో చేయాల్సి ఉందన్నే విషయాన్ని గుర్తించి భువనగిరి నియోజకవర్గంలోనే నూతన స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. దాదాపు 8 సబ్ స్టేషన్ లు త్వరలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని , తదనుగుణంగా భువనగిరి లో నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదన్నారు. గత పాలనలో ఒక్క సబ్ స్టేషన్ కూడా మంజూరు చేయలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నూతన సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ… రైతులకు అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు అందించేలా చూడాలని అన్నారు. నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక గొప్ప వరం అని అన్నారు. నూతన సబ్ స్టేషన్ ల ద్వారా విద్యుత్ అంతరాయం ఉండదన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, టీజేఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ పాటిల్ ఐ.ఏ.ఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి, తడక వెంకటేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.