వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 27 : ఛత్తీస్ గఢ్ దంతెవాడలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన సారయ్య (Saraiah)కు బంధుమిత్రులు, ఉద్యమ నేతలు గురువారం కడసారి వీడ్కోలు పలికారు. ఈనెల దంతవాడలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన ఐదుగురు మావోయిస్టులలో ఒకరు అంకేశ్వర సారయ్య ఉన్నారు. ఈయన స్వగ్రామం కాజీపేట మండలం తరాలపల్లి. గత రాత్రి ఆయన భౌతికకాయం స్వగ్రామానికి తన సోదరుడు తీసుకొచ్చారు. గురువారం ఉదయం సారయ్యను తలుచుకుంటూ ఆయన ఉద్యమ నేపథ్యాన్ని స్మరించుకున్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేసి అనునిత్యం ప్రజల పక్షాన నిలబడి గిరిజనులకు చదువు చెప్పిన గొప్ప ఉద్యమనేతని పలువురు కొనియాడారు. తరాల పల్లి గ్రామానికి చరిత్రలో ఒక పేజీ ఉంటుందని.. సారయ్యతోపాటు ఇదే గ్రామం నుంచి తొమ్మిది మంది ఉద్యమ నేతలు అమరులయ్యారని తెలిపారు. ఈ అంతిమయాత్రలో బంధుమిత్రుల కమిటీతోపాటు కుటుంబ సభ్యులు, సహచరులు పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.