హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో చదివి ‘నీట్’లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణ పతకాన్ని సాధించిన సాయిప్రవల్లిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్‌సీడీడీ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి, టీజీఎస్‌డబ్ల్యూఆరఈఐఎస్ కార్యదర్శి (ఎఫఏసీ) కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ(అకాడమిక్) సక్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదు : మంత్రి అడ్లూరి
ఎంసీహెచఆర్డీలో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల లో చదివి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు,చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసంసాధించిన సాయి ప్రవల్లికతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విజయం వెనుక ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం ఉన్నాయన్నారు. ఈ విజయాలు ఒక్క విద్యార్థుల కుటుంబాలకు మాత్రమే కాదు తెలంగాణ సమాజానికే గర్వకారణం అన్నారు.గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, అత్యాధునిక వసతి, డిజిటల్ విద్య, ఉచిత నీట్, జేఈఈ, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, సబ్జెక్టు నిపుణుల పర్యవేక్షణను ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఉచిత ప్రత్యేక కోచింగ్, అన్ని సౌకర్యాలు కల్పించి వారి కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





