– నిధులు కేటాయించి పనులు ప్రారంభం
– విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి రాజన్న ఆలయం సందర్శన
– వేములవాడను విస్మరించిన గత ప్రభుత్వం
– మంత్రి సీతక్క
వేములవాడ, ప్రజాతంత్ర, జనవరి 16: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని మంత్రి శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి విూడియాతో మంత్రి మాట్లాడారు. వేములవాడలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఆలయాల అభివృద్ధి.. భావోద్వేగాలు, ఆచారాలతో ముడిపడి ఉంది. ఈనెల 18న మేడారంలో క్యాబినెట్ భేటీ జరుగుతుంది. 19న మేడారం ఆలయాన్ని సీఎం పునఃప్రారంభిస్తారు. పుష్కరాల దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీతక్క తెలిపారు. కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని వ్యాఖ్యానించారామె. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. బీఆర్ఎస్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మేడారం సమ్మక్క ` సారక్క, వేములవాడ ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఏకకాలంలోనే నిధులు కేటాయించారని ప్రస్తావించారు మంత్రి. సమ్మక్క ` సారలమ్మ చరిత్ర, ప్రత్యేకతను శిలలపై రాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో రాజన్నను దర్శించుకుంటే నష్టం అంటూ దుష్పచ్రారాలు చేశారని అన్నారు. వేములవాడ రాజన్నను ఎంతోమంది భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారని తెలిపారు సీతక్క. ప్రస్తుతం.. వేములవాడకు భారీగా భక్తులు తరలివచ్చి రాజన్నకు మొక్కులు సమర్పిస్తుంటారని పేర్కొన్నారు. రాజన్నపై నమ్మకంతోనే ఇంతమంది భక్తులు ఆలయానికి వస్తున్నారని వెల్లడిరచారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామివారిని భక్తులు కొలుస్తుంటారని తెలిపారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను వేములవాడ రాజన్నను దర్శించుకున్నామని గుర్తుచేశారు. అలాగే, మేడారం సమ్మక్క ` సారక్క అమ్మవార్ల నుంచి పాదయాత్ర ప్రారంభించామని తెలిపారు. ఏ దేవాలయాల ప్రత్యేకత వాటికి ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





