రెండుతరాల కవిసంగమం’లో వారాల ఆనంద్

‘కవిసంగమం’ నిర్వహణలో అక్టోబర్ పదవతేదీన హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, సుల్తాన్ బజార్ (రాంకోఠి) లో జరుగనున్న ‘రెండుతరాల కవిసంగమం’లో సీనియర్ కవిగా కేంద్ర సాహిత్య అకాడెమి అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ పాల్గొంటారు. రెండవ శనివారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కొత్తతరం కవులు హాథీరామ్ సభావట్, చిట్ల ప్రేమ్ కుమార్, మామిడిపల్లి ఇంద్రాణి, వినులు పాల్గొంటారు. 45 నిమిషాల పాటు వారాల ఆనంద్ తన జీవితం, కవిత్వ నేపధ్యాల్ని వివరించి స్వీయ కవితలు చదువుతారు. అనంతరం నవకవులు తమ కవితల్ని వినిపిస్తారు.

కవిగా వారాల ఆనంద్ ‘మనిషి లోపల’, అక్షరాల చెలిమె’ ‘సొంతవూరు’, ‘ముక్తకాలు’, ‘చిన్నోడి ముక్తకాలు’ రాసారు. అనువాదకుడిగా ‘ఆకుపచ్చ కవితలు’, ‘ఇరుగు పొరుగు’ మొదలయినవి వెలువరించారు, ఇంకా సమాంతర సినిమాపై ఆయన సాధికారిక పుస్తకాల్ని తీసుకువచ్చారు. వైవిద్యభరితమయిన వారాల ఆనంద్ సృజన జీవితం కొత్త తరానికి ప్రేరణాత్మకం. పలువురు సీనియర్ రచయితలు, కవులతో పాటు అనేకమంది యువతరం కవులు కవయిత్రులు ఇందులో పాల్గొంటారు.

కవి సంగమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *