ఆర్టీసీని విధ్వంసం చేసి మొసలి కన్నీరు

– ‘చలో బస్‌ భవన్‌’ పేరుతో రాజకీయ కుట్రలు
-బీఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టబోతున్న చలో బస్‌ భవన్‌ కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చలో బస్‌ భవన్‌ కార్యక్రమంతో అనవసరమైన రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఆయన బుధవారం గాంధీ భవన్‌లో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై కేసులు పెట్టిన వాళ్లు ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మాజీ సీఎం కేసీఆర్‌ కనీసం పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ బకాయిలను తాము కడుతున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్టు ఆర్టీసీని పూర్తిగా ధ్వంసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం కొంత చార్జీలు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని వెల్లడిరచారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం సిటీ బస్సుల్లో పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ గురువారం ‘చలో బస్‌ భవన్‌’కు పిలుపునిచ్చిన విషయం విదితమే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page