– వాహన మరమ్మతులు వేగంగా చేపట్టాలి
– చెత్త వాహనాలకు అలారం ఏర్పాటు చేయాలి
– బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : బల్దియాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్ ,శానిటేషన్ఐ, సిసిసి, మెప్మా, డిఆర్ఎఫ్ విభాగాల అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, బయో మితనైజేషన్ కు సంబంధించి టెండర్ లు పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించాలని, ఇంటీరియర్ రికార్డు ఫెసిలిటీ (ఐఆర్ఎఫ్)కోసం ఏజెన్సీ స్థల గుర్తింపు చేపట్టి టెండర్ ఆహ్వానించాలని ఎస్ ఈని ఆదేశించారు. వాహన మరమ్మతులలో జాప్యాన్ని నివారించాలని, వాహనాలు దెబ్బతింటే వెంటనే సమాచారం అందజేసి మరమ్మతులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చూడాలని, అవసరం మేరకు టెండర్ పిలిచి సిబ్బందిని నియామకం చేసుకొని వాహన మరమ్మతులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఐసిసిసి వారికి సూచనలు చేస్తూ కమర్షియల్, బల్క్ జనరేటెడ్ వేస్ట్ కు వాహనాలు ఏర్పాటు చేసి వారికి రూట్ మ్యాప్ ఇవ్వాలని, మన వద్ద ఉన్న అన్ని స్వచ్చ ఆటోలకు రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి చెత్త సేకరణకు ఇళ్లను కేటాయించి వాహనాలకు ఆలారం ఏర్పాటు కూడా ఉండేలా చూడాలని సూచించారు. చెత్త వాహనాల తూకం జరగాలని ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు బాల సముద్రంలోగల కోకో పిట్ ను పునరుద్ధరించాలని, ఇందుకు సంబంధించిన పవర్ కు చెందిన బిల్లులు మంజూరు జరిగేలా చూసి కొనసాగించేలా చూడాలని కోకో పిట్ ఉత్పత్తులను విక్రయించడానికి గల అన్ని అవకాశాలను పరిశీలించి విక్రయించేలా చూడాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది హాజరు నమోదు చేయాలన్నారు. పారిశుధ్య సిబ్బంది హాజరు తోపాటు నాలుగు సార్లు అటెండెన్స్ నమోదు చేసే సిబ్బందిని వేరువేరుగా స్ట్రీమ్ లైన్ చేయాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు తీరుగానే వేతనాలు చెల్లించాలని, సిబ్బంది పనులలో నిమగ్నమై ఉంటారని సంబంధిత జవాన్లు వారి వద్దకే వెళ్లి హాజరు వేసేలా చూడాలని, వివిధ చెత్త తరలింపు చేసే వాహనాల డ్రైవర్ ల అటెండెన్స్ కూడా నమోదు చేయాలన్నారు. మెప్మాపెట్రోల్ బంక్ నిర్వహణ పురోగతిని కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఎస్ ఈ సత్యనారాయణ సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి డిఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఏంహెచ్ఓ డా.రాజేష్, ఈఈ లు, డిఈ లు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





