– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసికట్టుగా కృషి
– ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావులు దిశానిర్దేశం చేశారు. అనేక హామీలు ఇచ్చి అమలులో విఫలమైన కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈమేరకు బుధవారం సమావేశం నిర్వహించారు. అభ్యర్థి మాగంటి సునీత, దివంగత మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ తదితర పార్టీ నాయకులు హాజరయ్యారు. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయాలని, ఎవరికి వారు తమకు అప్పగించిన డివిజన్లలో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. కాంగ్రెస్ బాకీ కార్డుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్రలు నిర్వహించాలని, బూత్ కమిటీలు నిరంతరం వోటర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఈ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి చెక్ పడుతుందని పేర్కొన్నారు. ప్రచారం చివరి దశలో రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రచారానికి రావాలని కొందరు నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీనిపై ఆలోచిస్తామని కేటీఆర్ చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





