– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: విద్యార్థులు పరిశీలనాత్మక ఆలోచన, వినమ్రత, సేవాభావంతో కూడిన నాయకత్వ గుణాలను పెంపొందించుకోవాలని డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సూచిం చారు. నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో వార్షికోత్సవాల భాగంగా శనివారం నిర్వహించిన ‘ఫెరియా – వై ఫియెస్టా 3.0’ యూత్ పార్లమెంట్ సిమ్యులేషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూత్ పార్లమెంట్ అవలోకనం, విద్యార్థుల రెండురోజుల సదస్సు ప్రదర్శనతో కొనసాగింది. ఈ కార్యక్రమం విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవస్థ తీరుతెన్నులు, ప్రజాస్వామ్య చర్చా విధానాలపై ఆచరణాత్మక అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు మీరు పార్లమెంటేరియన్లుగా నటించారు.. రేపు మీరు నిజమైన భారత పార్లమెంటేరియన్లుగా మారతారు అని పేర్కొన్నారు. టీ.వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ యువతలో రాజకీయ అవగాహన, ప్రజాస్వామ్య చింతన పెంపొందించడంలో పాఠశాలలు చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రేరణాత్మకమని అన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్, టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యను అతిథులు అభినందించారు. ఆయన విద్యాసంస్థల ద్వారా అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రిన్సిపల్ టి. పద్మ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్స్ సిన్మోల్, అంకిత, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ సుధా తదితరులు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ పార్లమెంట్ కార్యకలాపాలపై న్యూస్‌లెటర్ విడుదల, బహుమతి ప్రదానం జరిగింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





