హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబరు 1:ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం రాష్ట్ర సచివాలయంలో సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు సుదర్శన్ రెడ్డి. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





