భద్రాద్రిలో 20నుండి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

– 29న గోదావరిలో తెప్పోత్సవం
– 30న ఉత్తర ద్వార దర్శనం
– ఉత్సవాలకు ముమ్మ‌రంగా  ఏర్పాట్లు  

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుండి జనవరి 9వతేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.  9వ తేదీన పవిత్ర గోదావరిలో స్వామివారు హంస వాహనంపై విహరించనున్నారు. తెప్పోత్సవం కన్నులపండువగా జరగనుంది. అలాగే 30వ తేదీ తెల్లవారుజామున  వైకుంఠ ద్వారదర్శం జరగనుంది. అధికారులు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఈ సందర్బంగా కల్యాణ మండపం వద్ద స్వామివారి వివిధ అలంకారాలలో భక్తులకు ద‌ర్శ‌నమివ్వనున్నారు. 20వ తేదీ శనివారం మత్స్యావతారం, 21 ఆదివారం కూర్మావతారం, 22వ తేదీ సోమవారం వరాహావతారం, 23వ తేదీ జయ (మంగళ)వారం నరసింహావతారం, 24వ తేదీ బుధవారం వామనావతారం, 25వ తేదీ గురువారం పరశురామావతారం, 26వ తేదీ శుక్రవారం శ్రీరామావతారం, 27వ తేదీ శనివారం బలరామావతారం, 28వ తేదీ ఆదివారం శ్రీకృష్ణావతారంలో ద‌ర్శ‌న‌మిస్తారు. దశమి సోమవారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీ తిరుమంగై ఆళ్వారుల పరమపదోత్సం, సాయంత్రం 4 నుండి రా త్రి  7 గంట‌ల‌ వరకు  శ్రీస్వామివారికి గోదావరి నదిలో తెప్పోత్సవము,  30వ తేదీ శీవైకుంఠ ఏకాదశి జయ (మంగళ)వారం ఉద‌యం 5 నుండి 6 గంట‌ల‌ వరకు ఉత్తర ద్వార దర్శనము నిర్వహించనున్నట్లు  దేవస్ధానం కార్యనిర్వాహనాధికారి దామోదరావు తెలిపారు. స్వామివారి తెప్పోత్సవాన్ని చూసేందుకు రాష్ట్రరాష్ట్రం నలుమూలలనుండి భక్తులు  అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున  అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. సమయం దగ్గర పడటంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో  నిమగ్నమైంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శనం సజావుగా చూసే విధంగా  అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు స్వాగతం పలికేందుకు ప్రధాన రహదారుల వద్ద స్వాగత ద్వారాలను కూడా ఏర్పాటు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page