ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ‌షట్‌డౌన్‌తో యూరియా కొరత

– తక్షణం జోక్యం చేసుకోవాలన్న మంత్రి తుమ్మల

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌రామగుండం ఫెర్టిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ‌షట్‌డౌన్‌పై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల సుమారు ప‌ది రోజులపాటు యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఖరీఫ్‌ ‌సీజన్‌లో యూరియా డిమాండ్‌ అధికంగా ఉన్న వేళ ఈ షట్‌డౌన్‌ ఆం‌దోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ రాశారు. గత ఖరీఫ్‌ ‌సీజన్‌లో112 రోజుల పాటు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తి నిలిపివేశారని గుర్తు చేశారు. ఈ సంస్థ తరచూ షట్‌డౌన్‌ ‌కారణంగా రాష్ట్రంలో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ‌ద్వారా రైతులకు యూరియా అందించడంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ‌కీలకమని ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం షట్‌డౌన్‌ను త్వరగా ముగించి యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ‌లోటును ఇతర దేశీయ ప్లాంట్లు, దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని కేంద్రానికి విన్నవించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా తగినంత యూరియా నిల్వలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. శ‌నివారం (నేటినుంచి)నుంచి ఎరువుల కర్మాగారాన్ని షట్‌డౌన్‌ ‌చేసిన సంగతి తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *