ట్రక్కును ఢీకొన్న కంటైనర్.. 13మంది మృతి

– మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

ముంబై, మే 18 : మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందందతో వెళుతున్న ట్రక్కును కంటైనర్ ఢీకొనడంతో 13మంది దుర్మరణం చెందారు. ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా దెబ్బతింది. ఘటనాస్థలిలోనే పదిమంది మృతిచెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *