దేశ ఐక్య‌తే మ‌న ధ్యేయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 
– బీజేపీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా’

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : దేశం కోసం అవసరమైతే త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని, దేశభక్తి, జాతీయ ఐక్యత, దేశ సమగ్రత కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. దేశభక్తి స్ఫూర్తితో బీజేపీ ఆధ్వర్యంలో రామచందర్‌రావు నాయకత్వంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం భారీ తిరంగా యాత్ర నిర్వహించారు. తొలుత బషీర్‌బాగ్‌లోని  కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామచందర్ రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రంగాల ప్రముఖులు అధిక సంఖ్యలో ట్యాంక్ బండ్‌కు చేరుకుని తిరంగా యాత్రలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జాతీయ జెండాలతో యాత్ర సాగింది. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతమంది యువతను చూసిన దేశ యువత దేశంతో, దేశం కోసం నిలబడి ఉందనే విశ్వాసం మనలో కలుగుతోందని అన్నారు. ఈ తిరంగా యాత్రలో ఉత్సాహంగా, క్రమశిక్షణతో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

కుల, మత, ప్రాంతమనే తేడా లేకుండా జాతీయ జెండాను చేతపట్టి తిరంగా యాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని కేంద్ర ీVAం శాఖ సహాయ మంత్రి బండి సంజjáYT కుమార్ అన్నారు. దేశం కోసం త్యాగాలు, బలిదానాలు చేసిన వారి చరిత్రను నేటి యువతకు గుర్తు చేసేందుకే తిరంగా యాత్ర చేపట్టామన్నారు. మోదీ పాలనలో దేశ అంతర్గత భద్రతతోపాటు రోడ్లు, రైల్వే, విమానయాన రంగాలను ఊహించని రీతిలో అభివృద్ది చేశారని వివరించారు. రాజకీయాలను పక్కనపెట్టి మోదీ చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర కేబినెట్‌లో జెన్ జీలకు అవకాశం కల్పించాలని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టిక్కెట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ప్రతీ భారతీయుడు తమ ఇంటిపై సగౌరవంగా జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలాడుతోందన్నారు. జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిన కాకతీయ విశ్వవిద్యాలయం ఏబీవీపీ కార్యకర్త సామ జగన్ మోహన్ రెడ్డి త్యాగాన్ని మనం స్మరించుకోవాలన్నారు. కాకతీయ వర్సిటీలో నక్సలైట్లు జాతీయ జెండాను దహనం చేయడాన్ని వ్యతిరేకించినందుకు జగన్‌మోహన్‌రెడ్డిని కాల్చిచంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్యాగం జాతీయ జెండా పట్ల మనకున్న గౌరవానికి, దేశభక్తికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. దేశం అభివృద్ధి చెందుతుంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఏ విధంగా అసూయతో, ఆందోళనతో చూస్తున్నాయో అదేవిధంగా మన దేశంలోని కొన్ని ప్రతిపక్ష శక్తులు కూడా బాధపడుతున్నాయని అన్నారు. ఇటీవల పార్లమెంటులో వందేమాతరం గీతాన్ని జాతీయ గీతంగా ప్రవేశపెట్టగా మజ్లిస్ పార్టీ నాయకులు దానికి వ్యతిరేకంగా మాట్లాడారని, ఈ విషయంలో మీకు ధైర్యం ఉంటే వందేమాతరం గీతాన్ని వ్యతిరేకిస్తున్న మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.

ప్రతి వారిలో జాతీయతా భావాలు మరింత పెరగాలి

తిరంగా యాత్ర వంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, దేశంలో ప్రతి పౌరుడు జాతీయ జెండాను గౌరవించాలని, ఆ గౌరవం రావాలంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయతా భావాలు మరింత పెరగాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దేశభక్తి, జాతీయతా భావాలకు త్రివర్ణ పతాకం ఒక గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు.

ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందుతుంది

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతోపాటు, స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అనేకమంది త్యాగధనులు, మహానీయులను స్మరించుకుంటున్నామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. కులం, మతం, ప్రాంతం, భాష ఏదైనా కావచ్చు.. కానీ మనందరం ముందుగా భారతీయులం.. దేశం తర్వాతే ఇతర గుర్తింపులు ఉండాలి అని చెప్పారు. మనం భారతీయులం అనే భావనతో దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశ సమగ్రతను, భద్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను, సమగ్రతను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.

అందరం భరత మాత ముద్దు బిడ్డలం

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి అరుణాచలం వరకు భాషలు, సంస్కృతులు వేరైనా భరత మాత ముద్దుబిడ్డలుగా మనమంతా ఒక్కటిగా నిలబడ్డాం అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మోదీ నాయకత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నదన్నారు. భరతమాత ముద్దుబిడ్డలుగా ఈరోజు ప్రపంచంలో మన దేశ కీర్తిపతాక ఎగురుతుంటే మనం గర్వపడుతున్నాం. ఆ కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీకి మనమంతా అండగా నిలబడాలని కోరారు. దేశ స్వాతంత్య్రాన్ని, దేశ సమగ్రతను కాపాడుకోవడంలో ఈ తరం అంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *