– తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకులిద్దరూ పెడదోవ పట్టడంతో ఓ తల్లి తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధ కేపీహెచ్‌బీ సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ పైవేటు హాస్టల్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తున్నది. అక్కడే ఓ గదిలో నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కొన్నేళ్ల కిందట తండ్రిని చంపిన కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అలాగే చిన్న కొడుకు గంజాయికి బానిసై నిత్యం తల్లిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇలా చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ పెడదోవ పట్టడంతో మనోవేదనకు గురైన సుధ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


