– మొత్తం 15 రాష్ట్రపతి పతకాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: తెలంగాణ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖకు మొత్తం 15 రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు. ఇందులో 3 గ్యాలంట్రీ మెడల్స్, 2 విశిష్ట సేవా పతకాలు, 10 ప్రతిభావంతమైన సేవా పతకాలు ఉన్నాయి. వీరత్వానికి ప్రతీకగా అందించే గ్యాలంట్రీ మెడల్స్‌కు తెలంగాణకు చెందిన ముగ్గురు జూనియర్ కమాండోలు ఎంపికయ్యారు. బి.సత్యారావు, కె.సందీప్ కుమార్, జె.వంశీకృష్ణ ఈ పతకాలను అందుకోనున్నారు. విధి నిర్వహణలో ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అసాధారణ తెగువకు గుర్తింపుగా వీరికి ఈ పురస్కారం దక్కింది. దీర్ఘకాలంగా అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఇచ్చే విశిష్ట సేవా పతకాల విభాగంలో ఇద్దరిని ఎంపిక చేశారు. విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థత, సేవా ప్రస్థానాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక విధుల్లో ప్రతిభ, అంకితభావం, నిరంతర సేవలను గుర్తిస్తూ మరో 10 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్స్, పౌర రక్షణ, కారాగార సేవల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో పతకాలను ప్రకటిస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




