నేరాల స్వరూపం మారుతోంది

– సైబర్‌ ‌సెక్యూరిటీ ఆధ్వర్యంలో అవేర్‌నెస్‌
‌- రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్‌ ‌సిటిజన్స్‌కు అవగాహన
– డీజీపీ ఆనంద్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 14 : నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌వ్యాఖ్యానించారు. సైబర్‌ ‌నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సైబర్‌ ‌సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సురక్ష కా తిరంగా సైబర్‌ అవేర్‌నెస్‌ ‌కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సురక్ష కా తిరంగా కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్‌ ‌సిటిజన్స్‌ను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కొన్నేళ్ల క్రితం వరకు ఫిజికల్‌ ‌దోపిడీలు జరిగేవని.. కానీ ఇప్పుడు నార్కోటిక్‌, ‌సైబర్‌ ‌నేరాలు పెరిగాయని వెల్లడించారు. నార్కోటిక్స్ ‌బారినపడి విద్యార్థులు, యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సైబర్‌ ‌నేరాల బారినపడుతున్న వారు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడుతున్నారని చెప్పారు. సైబర్‌ ‌నేరాల బారినపడుతున్న వారు ఎవరు ఏం అనుకుంటారోనని బయటకు కూడా చెప్పుకోవడం లేదని డీజీపీ అన్నారు. తాము 40 రకాల సైబర్‌ ‌నేరాలను గుర్తించామని, ఇందులో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్‌ ‌ఫ్రాడ్స్ ఉం‌టున్నాయని వివరించారు. తాము ఎంత అడ్డుకట్ట వేస్తున్నా సైబర్‌ ‌నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ కొత్తగా సైబర్‌ ‌నేరాలకు పాల్పడుతున్నారని డీజీపీ ఆనంద్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *