ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేని పోరాటం

– కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు..
– సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వరుస విజయాలు
– రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి పొంగులేటి అభినందనలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  అక్టోబర్ 30 : ప్రభుత్వ భూముల పరిరక్షణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీ లేని వైఖరితో ముందుకు సాగుతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు భూములు అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు దశాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న భూ వివాదాలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన న్యాయపోరాటం చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణలో రెవెన్యూ, న్యాయశాఖల సమన్వయంతో బలమైన వాదనలు వినిపించడం వల్లే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వరుస విజయాలు దక్కుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల విలువైన భూమితో పాటు, తాజాగా మియాపూర్ భూములకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం ప్రజా ప్రభుత్వ న్యాయపోరాటానికి బలమైన నిదర్శనమని వివరించారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ కేసుల్లో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ భూమి ఏ ఒక్కరి సొత్తో కాదని, అది భావితరాల ప్రయోజనాలకు తోడ్పడే రాష్ట్ర ప్రజల ఉమ్మడి సంపద అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆక్రమణలకు పాల్పడినా, అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *