యూడీఎఫ్ ప్రభంజనం

-కేరళంలో పూర్తి ఆధిక్యం
– కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు
-కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన వేణుగోపాల్
~ ప్రజలు మార్పు కోరుకున్నారన్న శశిథరూర్

తిరువనంతపురం, మే 4 : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 98కు పైగా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార ఎల్డీఎఫ్ 35 సీట్లలో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో యూడీఎఫ్ విజయం తథ్యంగా కనిపిస్తోంది. దీంతో కేరళం తదుపరి సీఎం ఎవరనే చర్చ మొదలైంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత, కేరళంకు చెందిన తిరువనంతపురం ఎంపి శశిథరూర్ స్పందిం చారు. రాష్ట్రంలో వోటర్లు మార్పు కోరుకుం నయని శశిథరూర్ తెలిపారు. నిర్మాణాత్మకమైన, దూరదృష్టితో కూడిన విధానం వైపు వోటర్లు మారుతున్నట్లు ఈ తీర్పు సూచిస్తుందన్నారు. పాలక కూటమికి చెందిన ఎమ్మెల్యేలకు ప్రజలు వ్య తిరేకంగా వోటు వేశా రు. వారికి వోటు వేయడం అంటే, దుష్పరిపాలన కొనసాగడ మేనని ప్రజలు గ్రహించారు. ఇది వోటర్ల విచక్షణకు అద్భుతమైన సంకేతం. ఫలితం ఊ హించిన దాని కంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ సునాయాసంగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయం నాకు తెలియదు. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని థరూర్ సమాధానమిచ్చారు కేరళంలో యూ డీఎఫ్ గెలిస్తే ముఖ్య మంత్రి అయ్యేందుకు పార్టీలో చాలా మంది అర్హులు ఉన్నారని, అయితే ఆ పదవికి ముగ్గు రి పేర్లను పరిశీలి స్తున్నారని కాంగ్రెస్ సీని యర్ నాయకుడు పీజే కురియన్ తెలిపారు. అయితే ఆయన పేర్లను వెల్లడించలేదు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయాన్ని పార్టీలోని ప్రతి ఒక్కరూ ఆమోదిస్తార ని ఆయన చెప్పారు. అయితే అందరి దృష్టి కెసిఆ వేణుగోపాల్ పై ఉందని ప్రచారం. కేరళం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమెక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్) కూటమి తన సత్తా చాటింది. కేరళం రాజ ధాని తిరువనంతపురంలోని కేపీసీసీ పార్టీ రా ష్ట కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ కేక్ కట్ చేశా రు. సహచర నేతలకు ఆయన మిఠాయిలు పంచి పెట్టారు. కార్యా లయం వెలుపల కార్య కర్తలు, నేతలు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా కేరళం ప్రదేశ కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి పార్టీ శ్రేణులు పోటెత్తారు. అందుకు సంబంధించిన వీడియోలను పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దాదాపు దశాబ్దం తర్వాత కేరళంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వస్తుండడంతో.. ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కేవలం 40 స్థానాల్లోనే అధిక్యతను ప్రదర్శిస్తుంది.

కేరళం ఎన్నికల ఫలితాలు
యూడీఎఫ్  98
ఎల్డీఎఫ్       35
ఎన్డీయే        3
ఇతరులు   4


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *