– యువ ఇంజనీర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి
– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చే సుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీ రింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యో గాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటి, పరిశ్ర మల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరా రు. యూనివర్సిటీ చదువులకు, ఇండస్ట్రీ అవసరాలకు అంతరం పెరిగినందున ప్రతి సంస్థ తమ బాధ్యతగా శిక్షణ కార్య క్రమాలు చేపట్టాలని శ్రీధర్ బాబు సూ చించారు. నగరానికి చెందిన పిఎస్ ఆర్ టెక్ హబ్ సంస్థ పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు బేగంపేట లోని వివాంతా హోట ల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. టెక్నాలజీ రం గంలో నిత్యం ఎదురయ్యే పెను సవాళ్ల ను అధిగమించి పదేళ్లలో రూ.120 కోట్ల సంస్థగా నిలదొక్కుకునేలా చేయ డం పట్ల పీఎస్ టెక్ హబ్ అధినేత పి. శ్రీరంగారావును
శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. కరోనా సమయంలో ఎన్నో సంస్థలు మూతప డటమో, నష్టాలకు గురికావడమో జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక ఆవిష్కరణలు, ఏఐ లాంటి సవాళ్లను ఎదుర్కొని 250 మంది ఉద్యోగులకు భరోసానివ్వడం సాధారణ విషయం కాదని శ్రీధర్ బాబు కొనియాడారు. వేగంగా విస్తరిస్తున్న ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొ నేలా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సహకరి స్తోందని తెలిపారు. ‘ఏఐ హబ్’ పేరుతో ప్రత్యేక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వచ్చే రెండు నెలల్లో రీస్కిల్లింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తా మని శ్రీధర్ బాబు వెల్లడించారు. భారీ విస్తరణకు ప్రణాళికలు: పిఎస్ ఆర్ టెక్ హబ్ దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో కార్యాల యాల ను ఏర్పాటు చేసి సేవలను అం ది స్తోందని డైరెక్టర్ పి. నమ్యుత తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశం వెలుపల కార్యాలయాలను విస్తరించి ఉద్యోగుల సంఖ్యను 1,000 కి పెంచుతామని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




