ఆగి ఉన్న‌ లారీని ఢీకొన్న డీసీఎం

– ప్రమాదంలో డ్రైవర్‌, ‌క్లీనర్‌ ‌మృతి

పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూలై 22: రామగుండం ఎన్టీపీసీ రాజీవ్‌ ‌రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్ద‌రు వ్యక్తులు మృతిచెందారు. గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీ టైరు పంక్చర్‌ ‌కావడంతో రోడ్డుపై నిలపగా దానిని అదే మార్గంలో చత్తీస్‌గఢ్‌ ‌వైపు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌ ‌పూర్తిగా ధ్వంసమై డ్రైవర్‌, ‌క్లీనర్‌ ‌తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందగా క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పెట్రోలింగ్‌ పోలీసు సిబ్బంది బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ డ్రైవర్‌ ‌కూడా మృతిచెందాడు. డీసీఎం డ్రైవ‌ర్‌ను మనోహర్‌గా గుర్తించగా క్లీనర్‌ ‌వివరాలు తెలియరాలేదు. ఇద్దరూ చత్తీస్‌గఢ్‌కు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్టీపీసీ పోలీసులు వెల్లడించారు.

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న ట్యాంకర్‌.. యువకుడి మృతి

హైదరాబాద్‌:  ఔటర్‌ను ఆనుకుని నార్సింగి-పుప్పాలగూడ టోల్‌గేట్‌ ‌వద్ద వాటర్‌ ‌ట్యాంకర్‌ ‌బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్‌.. ‌బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న సుశీల్‌ ‌కుమార్‌(28) అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత అదుపు తప్పిన ట్యాంకర్‌ ‌మరో కారు, స్కూటీని కూడా ఢీ కొట్టింది. దీంతో మొత్తం మూడు వాహనాలను వాటర్‌ ‌ట్యాంకర్‌ ‌ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే నార్సింగి పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్యాంకర్‌ ‌డ్రైవర్‌ ‌రంజిత్‌ ‌సింహాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అలాగే గాయపడిన సురేష్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సుశీల్‌ ‌మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *