– సాగు అవకాశాలు పరిశీలించాలన్న మంత్రి తుమ్మల
– తనను కలిసిన పసుపు బోర్డు సెక్రటరీకి సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: ఆయిల్ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పసుపు బోర్డు కార్యదర్శి ఎన్.భవానిశ్రీకి సూచించారు. సెక్రటరీయట్‌లో మంత్రి తుమ్మలను ఆమె గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న రకాలకు బదులు అధికంగా కుర్క్‌మిన్ ఉన్న రకాలను సాగు చేయించేె విధంగా ప్రోత్సహించాలని, పసుపు ఉత్పాదకాల మార్కెటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమం వివరాలను మంత్రికి ఆమె వివరించారు. కోత అనంతరం ఉపయోగపడే పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పాలిషర్స్, గ్రైండర్లు వాంటి వాటిని రైతులకు సరఫరా చేస్తున్నట్లు, పసుపు రైతు ఉత్పత్తి సంఘాలను గుర్తించి వారికి రూ.23 లక్షల వరకు రాయితీ కల్పించి, కోత అనంతరం పసుపులో అవసరమయ్యే పనిముట్లను, యంత్రాలను అందిస్తున్నట్లు భవానిశ్రీ వివరించారు. రైతులకు ఐపీఎం పద్దతుల్లో ఆర్గానిక్ సర్టిఫికేషన్‌లో తోడ్పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పసుపును పౌడర్ రూపంలో ఐటీసీ, పతాంజలి వంటి వివిధ కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడిరచారు. తూర్పు, మధ్య దేశాలకు సరఫరా చేసే ఒక ప్రముఖ కంపెనీ పది ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్ యూనిట్ కూడా నిజామాబాద్‌లో స్థాపించడానికి ముందుకొచ్చిందని ఆమె మంత్రికి తెలియ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పసుపు ఉత్పత్తులకు ఫార్మా, ఆయుర్వేద రంగంలో ఉన్న అవసరాల దృష్ట్యా బోర్డు ద్వారా మార్కెటింగ్ లింకేజీలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





