పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలి

– బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: కాంగ్రెస్‌ పార్టీ హామీల పేరుతో రైతులను వంచించి పాలనను గాలికి వదిలేసిందని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్‌ రాజేందర్‌రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్ట మండల తహసిల్దార్‌ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించగా డిప్యూటీ తహసీల్దారుకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫకీర్‌ రెడ్డి మాట్లాడులంతూ పాడి రైతులకు సుమారు ఆరు నెలల నుండి బిల్లులు ఇవ్వకుండా పాల రేటు తగ్గించి వారి రక్తాన్ని తాగుతోందని, ఒకవైపు దానా రేట్లు పెరుగుతూ ఉంటే పాల దిగుబడి రాక పాడి రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి గ్రామంలో సీసీ కాంక్రీట్‌ కల్లాలు ఏర్పాటు చేయాలని, వడ్ల కొనుగోలు విషయంలో ఆలస్యం కాకుండా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ రచ్చ శ్రీనివాస్‌ ,రాష్ట్ర కిసాన్‌ మోర్చా కార్యవర్గ సభ్యులు గుంటుపల్లి సత్యం ,పట్టణ అధ్యక్షులు కారే ప్రవీణ్‌ ,పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్‌, భానుచందర్‌ గౌడ్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ గంధమల్ల మహేష్‌, మండల ఉపాధ్యక్షుడు ఏలూరు సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు భువనగిరి శ్యాంసుందర్‌, లంకలపల్లి శ్రీనివాస్‌, బొమ్మగాని రాజమణి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page