హయత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

– ఎలక్ట్రిక్ షాఫులో షాట్ సర్క్యూట్‌తో..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 :హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాపులో మొదలైన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న పరుపుల దుకాణానికి విస్తరించాయి. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందుగా జయశ్రీ ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్‌వేర్ షాపులో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న పరుపుల తయారీ షాపునకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత రెట్టింపు అయింది. పరుపులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి రెండు షాపులూ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలోని మరో రెండు షాపులు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో షాపుల బయట నిలిపి ఉంచిన ఒక బైక్ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సమాచారం అందుకున్న వెంటనే హయత్ నగర్ అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే షాపు లోపల పరుపుల నిల్వలు ఉండటంతో మంటలు మళ్ళీ మళ్ళీ మంటలు రాజుకున్నాయి. ఈ ఘటనలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *