బసవేశ్వరుడు గొప్ప తత్వవేత్త

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : బసవేశ్వర మహారాజ్ కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాదు.. ఆయన ఒక మహోన్నత సిద్ధాంతంగా, దైవంగా కోట్లాదిమంది గుండెల్లో కొలువై ఉన్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. సామాజిక విప్లవకారుడు, గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళులర్పించి ప్రజలకు, ముఖ్యంగా లింగాయత్ సమాజానికి బసవేశ్వర మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బసవేశ్వరుడి జీవిత చరిత్ర తరతరాలకు ప్రేరణాదాయకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బసవేశ్వరుని ఆలోచనా విధానం నుండి గొప్ప స్ఫూర్తి పొందారని, అందుకే అధికారికంగా బసవ జయంతిని నిర్వహించడంతోపాటు లండన్ నగరంలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించి మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశారని ఆయన చెప్పారు. బసవేశ్వరుడు ఆశించిన కుల రహిత, సమానత్వ సమాజ నిర్మాణం బీజేపీ లక్ష్యమన్నారు. బసవేశ్వరుడు బోధించిన ‘కాయకవే కైలాసం’ (శ్రమే దైవం) సూత్రం నేటికీ మన సమాజాన్ని భక్తి, సేవ, సామాజిక సమరసత వైపు నడిపిస్తోందన్నారు. సంస్కృతిని కాపాడుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం ఆ మహనీయుడు చూపిన బాటలో మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బసవేశ్వర మహారాజ్ ఆలోచనా విధానం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని, ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *