– మూడు రాష్ట్రాల సీఎంలు కలిసి ప్రారంభం
– కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పాటిల్
– ఒకే వేదికపై డి.కె, చంద్రబాబు, రేవంత్
– కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పాటిల్
– ఒకే వేదికపై డి.కె, చంద్రబాబు, రేవంత్
బళ్లారి, జూన్ 25: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ కలసి ప్రారంభిండం విశేషం. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు ఆయా రాష్టాల్ర మంత్రులు, అధికారులు, పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం విజయనగర జిల్లా హోసపేటలో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు వెళ్లారు. అంతకుముందు మూడు రాష్టాల్ర ముఖ్యమంత్రులు కొప్పల్ జిల్లా మునీరాబాద్‌లోని ఆడిటోరియంలో భేటీ అయ్యారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. తొలుత చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీ అవ్వగా.. సమావేశానికి రేవంత్ రెడ్డి 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. అనంతరం ముగ్గురు సీఎంలు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నీటి సమస్యలపై కీలక చర్చలు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి గేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లారు.
జల వివాదాలను పరిష్కరించుకుందాం : సీఎం రేవంత్‌రెడ్డి
తుంగభద్ర నది ఒడ్డున.. బళ్లారి వేదికగా జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.‘తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుంది. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోంది. బళ్లారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుంది. తక్కువ మాట్లాడటం. అత్యంత వేగంగా పనిచేయడం సీఆర్ పాటిల్ ప్రత్యేకత. అలాంటి వ్యక్తి.. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రిగా ఉండటంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు. నీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో నీరంతా సముద్రంలో కలుస్తున్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌లో పాలమూరుకు కేటాయించిన 15 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీలు మాత్రమే వాడుకోగలుగుతున్నాం. దాదాపు 10 టీఎంసీల నీరు మా వరకూ రావట్లేదు. రాజోలిబండ సమస్యను సీఆర్ పాటిల్, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు. మూడు రాష్ట్రాల కరువు జిల్లాలకు ఇది పరిష్కారం చూపబోతోందని పేర్కొన్నారు. గురువారం తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లు ప్రారంభించాక, కర్ణాటక కొప్పల్ జిల్లా మునీరాబాద్ బహిరంగ సభలో సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. కర్నూలు, అనంతపురం రైతుల సమస్యలు తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు చంద్రబాబు అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని తెలిపారు. నీటి సమస్యలు పరిష్కరించుకోకపోవడం తో నీరు సముద్రం పాలవుతోందని చెప్పారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని అన్నారు. తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీరు తమకు రావడం లేదని చెప్పారు. రైతులకు న్యాయం జరగాలని తాము ఆశిస్తున్నామని అన్నారు. చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని తెలిపారు. తమకు పంచాయితీలు వద్దని.. పరిష్కారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ, తెలంగాణలోని లక్షలాదిమంది రైతుల సమస్యకు తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పరిష్కారమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నీటి సమస్యను పరిష్కరించక పోవడంతోనే పాలమూరు వాసులు వలసలు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. నీటి సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయని.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించామని తెలిపారు. తుంగభద్రలో పూడికతీతకు సంబంధించిన వ్యవహారంపై కేంద్రమంత్రితో చర్చించామని అన్నారు. తుంగభద్ర నది ఒడ్డున జరిగిన చర్చలు అంతరాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నీటి సమస్యను సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు. ఆయన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారనే నమ్మకం తమకు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





