మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవవన్‌లో ఆ మహనీయుడి చిత్రపటానికి పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారు.. పేదలకు పంచారు.. ఆయన బహు భాషా కోవిదుడు.. ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి అని కొనియాడారు. పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని, భూ సంస్కరణలు అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లక్షలాది ఎకరాల భూములు పంచారని, విద్య, వైద్య రంగాల్లో ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన పీవీ తమ అందరికీ స్ఫూర్తిదాయకం ఆయన మంత్రి సీతక్క అన్నారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ యువ నాయకుడు కుంజా సూర్య, కాంగ్రెస్ నాయకురాలు రేగులపాటి రమ్యారావు తదితరులు పాల్గొన్నారు.