17 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ బదిలీలు, పోస్టింగ్స్ తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీగా వెయిటింగ్లో ఉన్న కె.బాలకృష్ణారెడ్డిని మల్కాజిగిరి సైబర్ మ్స్ ఏసీపీగా నియమించారు. అక్కడి ఎసీ పీ ఎస్.జి.శివశంకర్ను బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశిం చారు. ఎస్.కె.అబ్దుల్ రహమాన్ను జయ శంకర్ భూపాలపల్లి డీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా, ఏ.రవి కుమార్ను జగి త్యాల డీసీఆర్ బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎ స్పీగా నియమించారు. బి. నందిరామ్ నా యకు హైదరాబాద్లోని డీజీపీ కంట్రోల్ రూమ్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. బి.సో మ్నారాయణ్ సింగ్ను టీజీపీఏలో డీఎస్సీ గా, జె.వెంకటేశ్వర్రావును మెదక్ డీసీఆర్ బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా నియమిం చారు. బి. కిషన్ కుమార్కు హైదరాబాద్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా, ఎల్. రమేశ్ కుమార్కు హైదరాబాద్ సీటీసీ ఏసీ పీగా బాధ్యతలు అప్పగించారు. ఎన్.శ్రీనివా సరెడ్డిని సంగారెడ్డి డీసీఆర్ బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా, కదరు వెంకట్రెడ్డిని టీజీపీఏ డీఎస్పీగా నియమించారు. కొమట్ల సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా, ఎస్. సుదర్శన్కు హైదరాబాద్ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. ఎన్.శంకర్ను హైదరాబాద్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా, పి. విజయ్కుమార్ను వెస్టన్ రోడ్ సేఫ్టీ డీఎస్పీగా నియమించారు. రాజన్న సిరిసిల్ల డీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా ఉన్న కె. భాస్కర్ను బదిలీ చేసి టీజీపీఏ డీఎస్పీగా నియమించారు. ఆదిలాబాద్ డీసీఆర్బై ఫంక్షనల్ వర్టికల్స్ డీఎస్పీగా ఉన్న ఎం. వెంకట నర్సయ్యను బదిలీ చేసి సీఐడీ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. బదిలీ అయిన అధికారులను సంబంధిత యూనిట్ అధి కారులు వెంటనే రిలీవ్ చేసి, కొత్త పోస్టిం గెలలో విధుల్లో చేరేలా చర్యలు తీసుకో వాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *