కాజీపేటలో పూర్తి కావచ్చిన రైళ్ల తయారీ యూనిట్

– ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ఇక్కడే
– రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూదిల్లీ, మే 28: కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై అశ్వినీ వైష్ణవ్ కీలక సమీక్ష నిర్వహించారు. ‘రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేస్తుందన్నారు. వీటిని దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఇంటర్ సిటీ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్‌తో రూపొందుతాయి.. ప్రతి రైలులో 20 కోచ్‌లు ఉంటాయి.. వీటిలో సురక్షితమైన కోచ్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు అమర్చుతాం. ఈ రైళ్లు గంటకు 130 కి. మీ వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తాం.. వీటిలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది.. రైలు బ్రేకులు వేసినప్పుడు అది విద్యుత్ జనరేటర్‌గా మారి పునరుత్పత్తి అయిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే అధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాం’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *