వ‌న‌ప‌ర్తిలో విషాదం

– అప్పుల భూతానికి ఒకే కుటుంబంలో నలుగురు బలి
– భార్య, పిల్లలను చంపి మామిడి తోట కౌలుదారు ఆత్మహత్య
– చనిపోయే ముందు కన్నీరు పెట్టించే సెల్ఫీ వీడియో, వాయిస్ రికార్డింగ్స్

వనపర్తి, ప్రజాతంత్ర, మే 27: అప్పుల భూతం, వడ్డీ వ్యాపారుల వేధింపులు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. మామిడి తోటలు కౌలుకు తీసుకున్న ఓ రైతు సరైన దిగుబడులు రాక అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడానికి ప్రైవేటు బ్యాంకులో ఇంటిని తనఖా పెట్టాడు. రెండు నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో ప్రైవేటు రుణ సంస్థ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారి వేధిం పులు పెరిగాయి. వారి వేధింపులు తట్టుకోలేక భార్య, కుమారుడు, కుమార్తెను తాళ్లతో కట్టేసి తోటలో ఉన్న నీటి సంపులో పడేశాడు. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సల్కేలాపూర్ గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్కు చెందిన మామిడి తోట గుత్తేదారు గగ్గల్ల నరసింహ (36) వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురంలో మామిడి తోటను నాలుగేళ్లుగా కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిపై తీసుకున్న రుణం కిస్తీలు చెల్లించాలని ఒత్తిడి చేసి, మానసికంగా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. వేధింపులు తట్టుకోలేక నర్సింహ కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహ భార్య హేమలత (31), కుమారుడు సాయి నిహాల్ (15), సాహితిశ్రీ (13) లను చేతులు కట్టేసి మామిడి తోటలోని సంపులో వేసి ముంచడంతో మృతి చెందారు. నరసింహ ఆత్మహత్య చేసుకునే ముందు అప్పుల బాధతో వేధించిన వారి సమాచారం వివరాలు తెలుపుతూ సెల్ ఫోన్ స్టేటస్ ద్వారా బంధువులకు సమా చారం అందించారు. అతడు ఆత్మహత్య చేసుకునే సమయంలో గద్వాలలోని తన వదిన (భార్య అక్క) అల్లుడు దరిశెల్లికి ఫోన్ చేసి అప్పులు ఇచ్చినవారు వేధింపు లకు గురిచేస్తున్నారని తన కుటుంబ సభ్యులు నీటి సంపులో పడుకున్నారని ఏడుస్తూ తెలిపి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులు చెల్లించాలని వేధిస్తున్న వారి వివరాలు సెల్ ఫోన్ లో వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్ పెట్టుకున్నాడు. రూ.60 లక్షలు అప్పు ఉంటే రూ. కోటి 20 లక్షలకు పత్రాలు రాయించుకున్నారని ఆరోపించా రు. హోమ్ లోన్ వారు ఇంటి లో ఉన్న ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకొని ఇంటికి నోటీసులు అంటించి ఆవేదనకు గురి చేశారని వాపోయాడు. వడ్డీ వ్యాపారులకు రూ.3 వడ్డీ కడుతూ వచ్చానని అప్పుల భారం మోయలేక, చిత్రహింసలు భరించలేకపోతున్నానని బోరుమన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మృతుడి కూతురు, కుమారుడిని పాఠశాలలో ఎగతాళి చేస్తున్నారని చదువు మాన్పించి తోటలో పనులు చేయించాడని తెలిపారు. మామిడి తోటకు లక్షల అప్పులు చేసి మందులు వేసి నష్టపోయినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనను చూసి కన్నీరు మున్నీర య్యారు. సంఘటన స్థలాన్ని డిఎస్పి గిరిబాబు, సిఐ రాంబాబు, ఎస్సై వెంకటేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై డీఎస్పీ గిరిబాబు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు అనాలోచిత చర్యల వల్ల జీవితాలు నాశనం చేసుకుంటారని తెలిపారు. నరసింహ మామిడి తోటలను కౌలుకు తీసుకొని అప్పుల వారి ఒత్తిడితో కుటుంబ సభ్యులను నీళ్ల సంపులో ముంచిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి వాయిస్ రికార్డులను పరిశీలించి కుటుంబ సభ్యుల మృతికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *