– గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
– సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ
– అద్దె భవనాలపై సమగ్ర నివేదిక అందించాలి
– సొంత భవనాల్లో ఉన్న గురుకులాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు
– గురుకుల, సంక్షేమ వసతి విద్యా సంస్థలపై సమీక్ష
ఖమ్మం, ప్రజాతంత్ర, మే 27 రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఖ మ్మం కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ దివా కర టిఎస్., అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి గు రుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థలపై ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా గురుకుల పాఠ శాలల్లో అడ్మిషన్లు పెరిగేలా అధికారులు ప్ర త్యేక దృష్టి సారించాలని సూచించారు. సీట్లు పూర్తిగా భర్తీ కాని రెసిడెన్షియల్ పాఠశాలలపై అధ్యయనం చేసి కారణాలు గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని వసతివిద్యా సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వేసవిలోనే అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతులను కల్పించా లని సూచించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశా లలో డైట్ ఛార్జీలు, మెనూ వివరాలను తప్పని సరిగా ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి గురు కుల విద్యాసంస్థకు ఒక జిల్లా అధికారిని ఇన్ చార్జిగా నియమించి, వారు ప్రతి నెల పాఠశాలలను సందర్శించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు రెగ్యులర్ పాఠశాలలను సందర్శించి తనిఖీ నివేదికలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించా రు. వైద్యులు కూడా ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు.
అద్దె భవనాలపై సమగ్ర నివేదిక
అద్దె భవనాల్లో ఉన్న గురుకులాల పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశిం చారు. అవసరమైన మరమ్మతులు నిరంతరం చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఎన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయో, యంగ్ ఇండియా పాఠశాలలు పూర్తయ్యాక ఎన్ని తరలిం చవచ్చో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు వొచ్చే 12 రోజుల్లో అన్ని పాఠశాలలను చెక్స్ట్ ప్రకారం పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పిం చాలని ఆదేశించారు. వొచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం లు విద్యార్థులకు సకాలంలో అందించడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భారీగా నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, అద్దెల చెల్లింపులు ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నదని తెలిపారు. మరమ్మతుల నిధులు కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో పనులు క్షేత్రస్థాయిలో వేగంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనుల బిల్లులు అధికంగా క్లియర్ చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ పనుల బిల్లుల చెల్లింపులకు డీఎంఎన్టీ నిధులను కూడా విని యోగిస్తామని చెప్పారు. విద్యా సంస్థ లకు ఉచిత విద్యుత్ అందుతున్న నేపథ్యంలో స్వంత భవనాల్లో నడుస్తున్న గురుకులాల్లో సోలార్ ప్యానెల్ల ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గురుకులాల ప్రాంతీయ సమ న్వయకర్తలు, ఎస్ఈ, ఎన్పిడిసిఎల్ శ్రీనివాస్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





