– సంక్షేమాన్ని విస్మరించి, స్కామ్‌ల్లో మునిగిన కాంగ్రెస్
– కంటకంగా రేవంత్ పాలన
-హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకుల సమీక్షలో కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, కేవలం సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా కాంగ్రెస్ మారిందని, అందుకే సమాజంలోని ప్రతి వర్గం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన విమర్శించారు. ఈరోజు పార్టీ నేతలతో పాటు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు, విద్యార్థుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, అవినీతి, స్కామ్‌లు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, అనుసరిస్తున్న విధానాలు, సాగిస్తున్న పాలన ప్రజా కంటకంగా మారాయని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలం ముగిసిపోతుందనే విషయం స్పష్టమవుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని అన్నారు. రైతులు సాగునీటి కోసం అడుగుతుంటే, వారికి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి “రక్తం పారిస్తా” అన్నట్లుగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో, కరువు అంచున ఉండగా, ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలందరిలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయని పేర్కొన్నారు. చివరకు రైతులు కూడా “మా రక్తాన్ని తీసుకోండి… కానీ మా పొలాలకు నీళ్లు ఇవ్వండి” అని డిమాండ్ చేసే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. యువత, నిరుద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరిట భారీ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎప్పటికప్పుడు ఆ మోసాన్ని ఎండగడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లలోని హామీల అమలు వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వరుసగా సభలు నిర్వహిస్తోందని తెలిపారు. వరంగల్ రైతు సభ అనంతరం, ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ సదస్సు ఏర్పాట్లపై నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. యువజన సభకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, అలాంటి ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌తోపాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని సీనియర్ నాయకులు కేటీఆర్‌కు వివరించారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు