కామారెడ్డి జిల్లాలో  విషాదం

– మంజీరలో నలుగురు చిన్నారుల మృత్యువాత
– శోకం మిగిల్చిన ఎల్లమ్మ పండగ వేడుక

కామారెడ్డి,ప్రజాతంత్ర,జూన్‌5: ‌కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం మంగల్‌ ‌కిష్టాపూర్‌ ‌గ్రామానికి చెందిన కొంతమంది బాన్సువాడ మండలం బుడిమి శివారులోని మంజీరా నది వద్ద ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. వీరిలో న‌లుగురు చిన్నారులు భానుప్ర‌సాద్‌, అనిత, పావని , శివాని నదిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో నదిలో నలుగురూ గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి భానుప్రసాద్‌ను రక్షించారు. మిగిలిన ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరంతా నదిలో ఊబిలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన సమీపంలోని ఒక మహిళ వారిని రక్షించే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను రక్షించారు. అలాగే ఊబిలో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బొల్లాక్‌పల్లికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం బాన్సువాడ మండలం బుడిమి గ్రామం వద్ద ఎల్లమ్మ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆ గ్రామానికి చెందిన పలు కుటుంబాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడుక జరిగింది. అనంతరం భోజనాలు చేసిన తర్వాత నలుగురు చిన్నారులు మంజీరా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి.. ఊబిలో చిక్కుకుని మరణించారని పోలీసులు చెప్పారు. వీరంతా 10 ఏళ్ల లోపు వారేనని తెలిపారు. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *