– అన్యాక్రాంతం కాకుండా కాపాడిన హైడ్రా
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్5:హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశారు. రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది.పుప్పాలగూడ భూముల్లో చారిత్రక రాతి గుట్టలు ఉన్నాయి. ఈ భూములను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కేటాయించింది. చారిత్రక గుట్టలను కాపాడాలని కోరుతూ సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని రక్షించాలని ఉన్నత న్యాయస్థానం మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జాప్యం కావడంతో భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.