కాకతీయ టెక్స్‌టైల్‌ ‌పార్క్‌లో విషాదం

– లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు టెక్నీషియన్ల మృతి

వరంగల్‌, ప్రజాతంత్ర,ఆగస్ట్13:  వరంగల్‌ ‌జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ ‌పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణెశా ఎకోపెట్‌ ‌క్లాత్‌ ‌ఫ్యాక్టరీలో లిప్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అభిలాష్‌ (30), ‌సూర్యప్రకాశ్‌ (31)‌గా మృతులను గుర్తించారు. అయితే, వారిద్దరూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షార్ట్‌సర్క్యూట్‌ ‌కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. లిప్ట్‌లో ప్రమాదం ఎలా జరిగింది? నిజంగానే షార్ట్‌సర్క్యూట్‌ ‌జరిగిందా వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

——————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *