– హైదరాబాద్`విజయవాడ రహదారిపై ఇక్కట్లు
– ఎల్బీ నగర్ మెట్రో వద్ద కి.మీ వరకు ప్రయాణికుల క్యూ
హైదరాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ నగరం నుంచి దసరా సెలవులకు వెళ్లిన వారు తిరిగి వస్తుండంతో వరుసగా రెండో రోజూ విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కి.విూ మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడిరది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగర బాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజాతోపాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడిరది. చింతలకుంట పైవంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఎంతకూ వాహనాలు కదలక పోవడంతో జనం మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఈ నేపథ్యంలో మెట్రో సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చిన వారితోపాటు ఆఫీసులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో కీలోవిూటరు మేర క్యూలైన్‌లో నిల్చున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. క్యూలైన్ నుంచి ప్లాట్‌ఫాంపైకి చేరేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





