హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: హన్మకొండ దుర్గా కాలనీ నివాసి అయిన ప్రైవేట్ ఉద్యోగి టి.రవీంద్రాచారి గుండెపోటుతో శనివారం రాత్రి మరణించగా ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు ఎల్‌వీపీ హాస్పిటల్ టెక్నీషియన్ లక్ష్మణ్, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్‌లు ఆ కుటుంబానికి నేత్రదానంపై అవగాహన కల్పించగా రవీంద్రాచారి భార్య కృష్ణవేణి, కుమార్తెలు చంద్రిక, భువన్‌లు రవీంద్రాచారి నేత్రాలను దానం చేశారు. దీంతో ఇద్దరు అంధులకు కొత్త జీవితం ప్రసాదించినట్లయింది. సేకరించిన నేత్రాలను హైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ కంటి హాస్పిటల్‌కు పంపారు. నేత్ర దానానికి అంగీకరించిన కుటుంబానికి శ్రవణ్ కుమార్, ఫౌండేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ సిహెచ్.దళపతి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కె.శంకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి సహా అనేకులు అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





