ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : వెయ్యి కోట్లతె కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను సోమవారం సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్ వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్ ను సోమవారం మధ్నాహ్నం 12 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి.