– వనపర్తి జిల్లాలో ప్రమాదం
వనపర్తి, ప్రజాతంత్ర, మే 29; జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మల్లపల్లి వద్ద చోటుచేసుకుంది. కొత్తకోట సీఐ రాంబాబు తెలిపైన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్నారు. ముమ్మల్లపల్లి వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ, బొలేరోను బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



