పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం

– 11మంది మృత్యువాత
– ఆందోళనకరంగా పలువురి పరిస్థితి

పుణె, మే 29: మరోమారు కల్తీ మద్యం కాటేసింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక మద్యం సేవించిన అనంతరం బాధితులు ఒక్కసారిగా వాంతులు, కంటిచూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే వారిని సప హాస్పిటల్‌కు తరలించినప్పటికీ పలువురు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా స్పందించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాల్లో పాల్గొన్నవారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. వీరిద్దరూ మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *