ఈ ప్రయత్నం ప్రత్యేకించి ప్రత్యేకం

సృజన (సంగీతం, సాహిత్యం, కళ, సినిమా) ఏ సమూహంలోనైనా, సమాజంలోనైనా గుప్పెడుమంది మధ్య సంభాషణగా మారిపోతూ వచ్చింది. 20వ శతాబ్దం ఆవిష్కరించి రుద్దిన కెరీరిజం దీన్నే పక్కా చేసి మరింత కునారిల్లేలా చేస్తూవస్తోంది. ఫలితంగా దృక్పథాల మధ్య చెలరేగే ఘర్షణ, సంభాషణ ఓ గుప్పెడుమంది వ్యవహారంలానే పరిణమించేలా చూసుకుంది. అయితే ఈ గుప్పెడు జనమే పిడికిలి బిగించిన, బిగించే జనం అని చరిత్ర రుజువు చేసింది. ఇది ఆ జాతి విలువగా నమోదు అయ్యింది.

అలాంటి విలువల వేదికలు నూరు పువ్వులవ్వాలి. వేల ఆలోచనల ఘర్షణలకు ఆనవాయితీగా నిలవాలి. సంభాషణ అనేది సేపియన్స్ మధ్య అదాటుగా మొలిచిన అంకురం కాదు. అదే వేరు. బుక్ బ్రహ్మ అయినా, ఛాయా అయినా, సమూహ అయినా మరో వేదిక అయినా ఇటీవలి అంకురాలు. వాటి వేర్లు కూకటివి. అవీ వాటి విలువలవీ, వాటి వెలుగుదారులవీ. ఈ నేలలో ఛాయా ప్రయత్నం ప్రత్యేకించి ప్రత్యేకం. ఏ సంభాషణకయినా దాని నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ప్రజా వేదికపై చేరుకోవాలని ఆశించడం వ్యూహ లేమిగా మారుతుంది. సంభాషణలని కొనసాగించగలిగే పరిణితి, నిర్మాణం ఆయా వేదికలు ఇంకా నేర్వాల్సివుందనేదే పాఠం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *