కల్మా చదవాల్సిన అవసరం లేదు

– సైదాబాద్ స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
– మిగతా స్కూళ్లపై నిఘా పెంచాలి
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థినికి కల్మా, సూరా అల్-ఫాతిహా నేర్చుకుని రావాలని హోమ్‌వర్క్ ఇవ్వడం అత్యంత అభ్యంతరకర విషయమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యా సంస్థలు విద్యను బోధించాలే తప్ప ఏ విద్యార్థిపైనా మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దే హక్కు లేదన్నారు. మొన్నటికి మొన్న ఆర్మూరులో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పిస్తే ఇదేంటని ప్రశ్నించిన ప్రజలపై అక్రమ కేసులు పెట్టారు.. నిన్న అత్తాపూర్‌లో ఆటో వెనక దేవుడి కొటేషన్ రాసుకున్న హిందువును ఒవైసీ మజ్లిస్ పార్టీ నాయకులు బెదిరించి భయబ్రాంతులకు గురిచేశారు.. నేడు సైదాబాద్‌లో హిందూ విద్యార్థులకు కల్మా నేర్పిస్తున్నారు.. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ ప్రభుత్వం కలిసి హైదరాబాద్‌ను, తెలంగాణను ఏం చేయాలని చూస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అన్ని ప్రైవేటు స్కూళ్లలో బోధనపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. ఇలాంటి వ్యవహారాలను చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదని, దీనికి తగినమూల్యం చెల్లించుకోక తప్పదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *