కోకాపేటలో 19న జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌

– హ‌రేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో..

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 16:  హైద‌రాబాద్ హ‌రేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 19న కోకాపేటతో తొలిసారి ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ జ‌గ‌న్నాధ‌, బ‌ల‌దేవ‌, సుభ‌ద్ర విగ్ర‌హాల‌తో ఈ వూరేగింపు ద ట్రైలైట్‌, గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డు, కోకాపేట‌నుంచి బ‌య‌లుదేరి రాజ్‌పుష్ప అట్రియా మీదుగా హ‌రేకృష్ణ హెరిటేజ్ ట‌వ‌ర్‌, నార్సింగి, కోకాపేట వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ ర‌థ‌యాత్ర‌లో వంద‌లాది మంది ప్ర‌జ‌లు ఉత్సాహంగా భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో పాల్గొన‌నున్నారు. సాయంత్రం 5గంట‌ల‌కు ర‌థ‌యాత్ర  ద ట్రైలైట్‌, గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డు, కోకాపేట‌నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. 5.20 గంట‌ల‌కు ప్ర‌థ‌మ హార‌తి, చీపురుతో మార్గాన్ని శుభ్రం చేసే కార్య‌క్ర‌మం వుంటుంది. ఆ త‌ర్వాత ముగ్గురు దేవ‌త‌ల‌కు హార‌తులిస్తారు. 5:30 గంట‌ల‌కు ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌కాచార్యులు శ్రీల ప్ర‌భుపాత ర‌థాన్ని తొలిసారిగా లాగుతారు. వూరేగింపు నిర్దేశిత మార్గంలో ప్ర‌యాణించిన త‌ర్వాత రాత్రి 8గంట‌ల‌కు తుది హార‌తితో ముగుస్తుంద‌ని, అనంత‌రం భోజ‌న కార్య‌క్ర‌మం వుంటుంద‌ని  స‌త్య‌గౌర చంద్ర దాస ప్ర‌భూజీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *