– యశోద హాస్పిటల్స్‌లో ‘ఇన్-హౌస్ ఎన్‌జిఎస్’ ప్రారంభం
– ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్
హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 16 : క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ తాజాగా ‘ఇన్-హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ’ (ఎన్‌జిఎస్) సదుపాయాన్ని ప్రారంభించింది. క్యాన్సర్ రోగుల జన్యు నిర్మాణాన్ని విశ్లేషించి వారికి అత్యంత ఖచ్చితమైన, వ్యక్తిగతీకరించిన వైద్యం అందించడంలో ఈ సాంకేతికత కీలక మైలురాయిగా నిలవనుందని ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ నిపుణులు) డాక్టర్ శిఖర్ కుమార్ వెల్లడించారు. హనుమకొండ యశోద క్లినిక్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యరంగం సంప్రదాయ ‘అందరికీ ఒకే రకమైన చికిత్స’ విధానం నుండి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, ఆధునిక చికిత్సలైన టార్గెటెడ్ ఓరల్ థెరపీలు, ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ వంటి రోగుల జీవనకాలాన్ని, వారి జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్స్ సొంతంగా(ఇన్-హౌస్) ఎన్‌జిఎస్ ల్యాబ్ ఏర్పాటు చేసిందని, దీనివల్ల వేగవంతమైన నివేదికలు వస్తాయని, హాస్పిటల్ ప్రాంగణంలోనే ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల రోగి జన్యుపరమైన మార్పులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా గుర్తించవచ్చని వివరించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల, రొమ్ము, జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లతోపాటు ఇతర కణితుల చికిత్స నిర్ణయాలలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, అత్యాధునిక సాంకేతికతను రోగులకు మరింత వేగంగా, చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
ప్రపంచస్థాయి క్యాన్సర్ కేర్
హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో అత్యంత అనుభవజ్ఞులైన మల్టీడిసిప్లినరీ క్యాన్సర్ నిపుణుల బృందం అందుబాటులో ఉందని, అత్యాధునిక రోబోటిక్ ఆంకో సర్జరీ, దేశంలోనే తొలి రేడియేషన్ థెరపీ వ్యవస్థలతోపాటు, ఎన్‌జిఎస్ సదుపాయంతో క్యాన్సర్ రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో హాస్పిటల్ సిబ్బంది సాయివెంకట్, విజయ్‌కుమార్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




